కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్‌ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనగా..మోదీ ఈ సందర్భంగా కొత్త కాయిన్స్‌ని రిలీజ్ చేసారు. మోదీ రూపాయి, రూ.2, రూ.5, రూ.10, రూ.20 బిళ్లలను విడుదల చేశారు. ఈ నాణేల స్పెషాలిటీ ఏంటంటే..అంధులు కూడా సులభంగా గుర్తించేలా కొత్త నాణేలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రత్యేక థీమ్ లోగోతో రూపొందించారు.