బ్రేకింగ్: వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలనీ మసీవుల్లాకు ఆదేశాలు ..కారణం ఇదే?

0
85

హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో పబ్ కి వెళ్లిన యువతిపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని వదలకుండా పోలీసులు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే గత శుక్రవారం సాయంత్రం ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడితో పాటు..వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో మసీవుల్లాను టిఆర్ఎస్ పార్టీ  వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. కానీ తాను రాజీనామా చేయనని మసీవుల్లా గట్టిగా వాదిస్తున్నాడు.