ఎంత‌టి తలనొప్పి అయినా నిమిషాల్లో తగ్గాలంటే ఇలా చేయండి..

0
92

ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌ కారణంగా మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల మందులు వాడడం వల్ల ఆశించిన మేరకు ఫలితాలు రాకపోగా..అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఈ సహజమైన చిట్కాతో తలనొప్పి సమస్యను ఎలా తొలగించుకోవాలో మీరు కూడా ఓ లుక్కేయండి..

త‌ల‌నొప్పిని త‌గ్గించేందుకు ఆవు నెయ్యి ఎంత‌గానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.  ఇది మ‌న శ‌రీరంలో వేడిని  తగ్గించి..వివిధ రకాల సమస్యల నుండి ఉపశమనం కల్పిస్తుంది. అంతేకాకుండా రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా త‌డి సున్నం కూడా త‌ల‌నొప్పిని త‌గ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక చిన్న బౌల్‌లో అర టీస్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని  తీసుకొని అందులో ఒక పావు టీస్పూన్ మోతాదులో త‌డి సున్నం క‌ల‌పాలి. ఆ తరువాత ఈ రెండింటినీ బాగా క‌లిపి పేస్ట్‌లా తయారుచేసి నుదుటిపై రాయాలి. త‌రువాత 5 నిమిషాలు అలాగే ఉంచి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీనివల్ల అనుకున్న దానికంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.