బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకొని అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం దీపికా పదుకునే అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యే ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.
దీపికా పదుకునే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో కామినేని ఆసుపత్రిలో దీపికా పదుకునెను తరలించారు. హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరగడంతో ప్రస్తుతం వైద్యుల సమక్షంలో దీపికా ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. నోవాటెల్ లో అబ్జర్వేషన్ లో దీపిక ఉన్నట్లు సమాచారం అందుతుండగా..ఇంకా దీనిపై పూర్తి స్పష్టత మరికాసేపట్లో వైద్యులు చెప్పనున్నారు.