U/A సర్టిఫికెట్ అందుకున్న ధృవ కిరోసిన్ మూవీ

-

డిఫరెంట్ ఐడియాలతో సరికొత్త కథలను తీసుకొని సినిమాలు రూపొందిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ధృవ. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.

- Advertisement -

బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.

ఇకపోతే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ వేడిలో చూపించిన అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఓ యూనిట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం చేశాయి. అలాగే కిరోసిన్ మూవీకి సంబంధించిన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి.

ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్
కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ దర్శకత్వం: ధృవ
పీఆర్వో: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...