బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు స్పష్టమైన హామీ లభించే వరకు తగ్గేదే లేదంటున్నారు.
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్షాలు నిలబడ్డాయి. తాజాగా సీపీఐ నేత నారాయణ విద్యార్థులకు మద్దతు ఇచ్చారు. ఇందుకోసం ఆయన క్యాంపస్ కూడా వెళ్లారు. కానీ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నారాయణను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళన ఆపేదే లేదని విద్యార్థులు చెబుతున్నారు.