ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. ఇందులో 1,20,866 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.