బ్రేకింగ్: రేపు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష

0
78
Telangana Congress Party

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నిన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అలర్లు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అయితే అగ్నిపథ్‌ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని దేశమంతా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

ఎయిర్‌ఫోర్స్‌ లాంటి విభాగాల్లో అగ్నివీరులకు ప్రత్యేక కేటాయింపు ఇస్తామంటూ కేంద్రం తాజాగా ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు గాంధీ భవన్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకువచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవిమానపరిస్తూ సైన్యంలో కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లాగా చేస్తూ యువత ను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరండని పిలుపునిచ్చారు.