5G సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక సెకన్లలోనే..

0
98

రోజురోజుకు సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతుంది. నిమిషాల్లో మనం ఇంటర్ నెట్ ను ఉపయోగించి మన పనులు చేసుకుంటున్నాం. నిమిషాల్లో సినిమా డౌన్లోడ్ ఇది ప్రస్తుతం నెట్ వేగం. రాను రాను ఇది సెకన్లు కావొచ్చు. ఇప్పటివరకు దేశంలో 4G సేవలు మాత్రమే ఉండగా తాజాగా 5G సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై ఆఖరులో స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ నిర్వహించనుంది.

5G అంటే ఏంటి?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ కంటే వేగంగా ఇంటర్నెట్‌ అందించే సర్వీసు.

4జీలో డౌన్‌లోడ్‌ వేగం 150 ఎంబీపీఎస్‌.

5G వేగం 10 జీబీపీఎస్‌.

సుమారు 3 గంటల హెచ్‌డీ క్వాలిటీ సినిమాను 5Gలో సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

5G కోసం కొత్తగా టవర్స్‌ ఏర్పాటు చేయనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న టవర్స్‌ ద్వారానే 5G సిగ్నల్స్‌ను అందించనున్నారు.

జులైలో 5G వేలం నిర్వహిస్తున్నారు. ఆ లెక్కన 2023 ప్రథమార్ధంలో దేశంలో 5G సేవలు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వేలం ప్రక్రియ పూర్తయిన రెండు నుంచి నాలుగు నెలల్లో సేవలు ప్రారంభమవుతాయని ఓ సర్వీసు ప్రొవైడర్‌ ప్రతినిధి గతంలో చెప్పారు.