తాను రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బానాన్ని అంటూ అప్పట్లో రాజకీయాల్లో సంలనం సృష్టించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సొదరి వైఎస్ షర్మిల. తన అన్న అందుబాటులో లేనప్పుడు ఆయన బాధ్యతలను తన భుజాన వేసుకుని ప్రజలముందుండి నడిపారు.
గతంలో ఓదార్పు యాత్ర, పాదయాత్రలు చేసి తనకంటు ఓ ఇమేజ్ కాదు పార్టీ క్యాడర్ లో బలమైన నాయకురాలిగా ముద్రవేసుకున్నారు షర్మిల. ఇంతకాలం పార్టీ కార్యకాలాపాలకే పరిమితం అయిన షర్మిలకు జగన్ కీలక పదవి ఇవ్వనున్నారని సమామారం..
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కుటుంబసభ్యులని ప్రభుత్వానికి దూరంగా పెట్టారు. అయితే కార్యకర్తలు మాత్రం షర్మలకు పార్టీలో ఏదో ఒకపదవైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ క్రమంలో జగన్ ఆమెకు త్వరలోనే కీలక పదవిని అప్పజెప్పనున్నారని సమాచారం.