తెలంగాణ బీఈడీ అభ్యర్థులకు శుభవార్త

0
91

తెలంగాణ బీఈడీ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువు ముగియగా అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ఎడ్‌ సెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఎలాంటి ఫైన్‌ లేకుండా అభ్యర్థులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

ఎడ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ గత నెల 10న విడుదలవగా ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి గడువు పెంచారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో edcet.tsche.ac.in దరఖాస్తు చేసుకోవచ్చు.

రూ.250 ఆలస్య రుసుముతో జూలై 1 వరకు, అలాగే రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.