తెలంగాణ: హైదరాబాద్లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్) సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హత
మొత్తం 201 ఉద్యోగాలకు డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)/ డిప్లొమా (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్:
ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్ ఏ లో మొత్తం 80 ప్రశ్నలు టెక్నికల్ సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్ బి నుంచి 20 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ఉంటాయి. పరీక్షను రెండు గంటలు నిర్వహిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 200 చెల్లించాలి. జులై 31న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.tssouthernpower.com వెబ్సైట్ సంప్రదించాలి.