ఎండోమెంట్ శాఖలోని అర్చకులకు శుభవార్త

0
118

ఏపి ఎండోమెంట్ శాఖలోని అర్చకులకు శుభవార్త. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అమలు  చేసే నిమిత్తం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీ హరిజవాహర్ లాల్ 5 లక్షల రూ/- సంవత్సర ఆదాయం కల ఆలయాల నుండి EAF/CGF/AWF/ AUDIT FEE బకాయిలుతో సహా వసూళ్లను నిలుపుదల చేయాలని జిల్లా DEO / జోనల్ DC/RJC లకు ఉత్తర్వులు జారీ చేశారు.

దీనితో దేవాలయంలోని స్వామి వారికి నిత్య దూప, దీప నైవేద్యాలకు, అర్చకుల జీతాలకు మొదట ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఈ తీర్పును క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో స్థానిక అధికారులు, అర్చకులకే బాధ్యత అప్పగించారు. కోర్టు తీర్పు అమలు చేయని దేవాలయాల అర్చకులు స్థానిక అర్చక సంఘ నాయకుల దృష్టికి మీ సమస్యను తెలియజేసి తక్షణమే పరిష్కరించుకోగలరని బ్రాహ్మణ చైతన్య వేదిక వారు కోరారు.