మహారాష్ట్రలోని మహైసల్ లో పెను విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కాగా వీరిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తెలియాల్సి ఉంది. ఒకచోట మూడు మృతదేహాలు, వేరు వేరు రూముల్లో మిగతా మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.