హైదరాబాద్ లో మరో దారుణం..పబ్ లో యువతిపై దాడి

0
99

జూబ్లీహిల్స్ లో సంచలనం సృష్టించిన మైనర్ యువతీ సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టార్ హోటల్ పబ్ లో యువతి పై దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్న ఓ యువతి ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి రూఫ్ టాప్ పబ్ లాంజ్ కి వెళ్ళింది.

ఆదివారం తెల్లవారుజామున పబ్ లోనే బాధితురాలి పై8 మంది బడా బాబుల పిల్లలు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలి దగరికి వచ్చి ఫోన్ నంబర్ అడగగా ఆమె నిరాకరించింది. దీనితో బాధితురాలిని అబ్రార్, సాధ్ అనే యువకులు పక్కకు తీసుకెళ్లారు. అంతేకాదు రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో వారిని ఆపేందుకు ప్రయత్నించిన స్నేహితురాళ్ళ పై యువకులు విచక్షణ రహితంగా బాటిల్స్ తో దాడి చేశారు.

అలాగే అడ్డుకోబోయిన పబ్ నిర్వహకుల పైన యువకులు బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలు పబ్ నుండి నేరుగా హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుండి రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. పబ్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని అప్పుడే నిజం బయటకు వస్తుందని బాధితురాలు డిమాండ్ చేస్తుంది.