విదేశాలకు వెళ్లడానికి సీఎం జగన్‌‌కు అనుమతివ్వొద్దు..కోర్టులో సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌

0
108
CM Jagan

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పారిస్‌ పర్యటనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కుమార్తె కాలేజ్‌ స్నాతకోత్సవానికి పారిస్ వెళ్లేందుకు సీఎం జగన్‌ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. అయితే పారిస్‌ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్‌ దాఖలు చేస్తూ జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు.

వివిధ కారణాలు చెప్పి జగన్‌ విదేశాలకు వెళ్తున్నారని, జగన్‌ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.