ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చాడు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇటీవలే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసి ప్రజలను ఆదుకుంటుంది సర్కార్.
తాజాగా దీనికి సంబంధించి అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీం పదవీ విరమణ అనంతరం జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ స్కీమ్ ను 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు కూడా పేరును నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కీమ్‌లో చేరిన వారి సంఖ్య 3.68 కోట్లకు చేరుకుంది.
ఈ స్కీమ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ చేరే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం వల్ల మంచి లాభాల బాట పట్టొచ్చు.