విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీలో కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హాను ఖరారు చేశారని విశ్వసనీయ సమాచారం.