బెంగళూరు, 21 జూన్ 2022: వీ మెంటార్ డాట్ ఏఐ మరియు వాద్వానీ ఫౌండేషన్ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవడం వల్ల ప్రత్యేకమైన మెంటారింగ్‌తో అత్యుత్తమ నిపుణుల సహకారం పొందేందుకు భారతదేశంలో ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్ధలు) సిద్ధమవుతున్నాయి.
లాభాపేక్షలేని సంస్థ వాద్వానీ ఫౌండేషన్, తమ కార్యక్రమం వాద్వానీ అడ్వాంటేజ్ (డబ్ల్యుఏ) ద్వారా తమ గ్లోబల్ ఫండింగ్, ప్రపంచ స్థాయి కార్యాచరణ మరియు కన్సల్టింగ్ ఉపకరణాలు , శిక్షణల ద్వారా ఎస్‌ఎంఈలను క్రమపద్ధతిలో వృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేయడం ద్వారా సుప్రసిద్ధమైంది. వీమెంటార్ డాట్ ఏఐ స్ధిరంగా ఎంఎస్‌ఎంఈలకు సాధికారిత అందించడంతో పాటుగా తమ ప్రపంచ శ్రేణి , సాంకేతికాధారిత, మానవ జోక్యం కలిగిన మెంటారింగ్ వేదిక ద్వారా 10 రెట్ల వ్యాపార వృద్ధిని అందిస్తుంది.
వాద్వానీ అడ్వాంటేజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సమీర్ సాథీ మాట్లాడుతూ ‘‘వీమెంటార్ డాట్ ఏఐతో మా వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు సంస్ధలకూ పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సంస్ధలూ ఎంఎస్‌ఎంఈలకు వాటి వృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాయి. వాద్వానీ ఫౌండేషన్ వద్ద మేము నిరుద్యోగం తగ్గించాలనే మహోన్నత లక్ష్యంతో కృషి చేస్తున్నాము. దేశంలో సుదీర్ఘకాలంగా నిలిచిన అతిపెద్ద సమస్యలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది’’ అని అన్నారు.
వీమెంటార్ డాట్ ఏఐ ఫౌండర్ డాక్టర్ శ్రీనివాస్ చుండూరు మాట్లాడుతూ ‘‘ భారతదేశపు మొట్టమొదటి ఎంఎస్‌ఎంఈ ఇన్‌క్యుబేటర్‌ను సృష్టించే దిశగా వేసిన అతి ముఖ్యమైన ముందడుగుగా ఈ భాగస్వామ్యం నిలుస్తుంది. ఇది సాంకేతికత ద్వారా ఎంఎస్‌ఎంఈ వృద్ధికి నిర్మాణాత్మక మరియు అత్యుత్తమ పద్ధతిలో సహాయపడనుంది. వీమెంటార్ డాట్ ఏఐ యొక్క ఇతర వేదికలైనటువంటి యుగ్మ (ఇంజినీరింగ్ మరియు ఎంబీఏ విద్యార్థుల కోసం వేదిక)పై ఆధారపడటం ద్వారా ఎంఎస్‌ఎంఈ వృద్ధికి సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో సహాయపడనుంది’’ అని అన్నారు.
ఎంఎస్‌ఎంఈ యాక్సలరేటర్ అలయన్స్ ఇప్పుడు ప్రత్యేకించిన, రాయితీతో కూడిన మెంటారింగ్‌ను పరిశ్రమలో అనుభవజ్ఞులచేత అర్హులైన ఎంఎస్‌ఎంఈలకు అందించనుంది. ఈ ఎంఎస్‌ఎంఈల టర్నోవర్ 5 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల నడుమ ఉంటుంది. తద్వారా ఎంఎస్‌ఎంఈలు తమ సొంత సామర్థ్యం అనుమతించిన దానికంటే వేగంగా వ్యూహాత్మక దృక్పథంతో వృద్ధి కోసం తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. ఈ రెండు మెంటార్ సంస్ధల యొక్క కార్యాచరణ మరియు ఉపకరణాల సమ్మేళనం, డూ ఇట్ యువర్‌సెల్ఫ్ (డీఐవై)కు అనుమతిస్తుంది. అలాగే చిన్నకంపెనీలకు అత్యధిక ప్రభావం కలిగిన డెలివరీ మోడల్‌ను మరియు సలహా ఆధారిత కన్సల్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ డెలివరీ మోడల్‌ను పెద్ద కంపెనీలకు అందిస్తుంది.
‘‘అర్హత కలిగి ఉండి మా లక్ష్యిత గ్రూప్‌లో భాగమైన ఎంపికైన ఎంఎస్‌ఎంఈలకు వ్యాపారాన్ని సమూలంగా మార్చే అనుభవానికి ప్రారంభంగా ఇది నిలుస్తుంది. వీరు ఎస్సెస్‌మెంట్ ప్రక్రియను ఎదుర్కోవడంతో పాటుగా పరిశ్రమలో నిష్ణాతుల చేత మెంటారింగ్ అందిస్తారు. వీరికి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్స్ (పీఎంఓలు)మద్దతునందిస్తారు. మెరుగైన వ్యాపార ఫలితాల కోసం లక్ష్యిత ప్రయోజనాలనూ వీరు అందించగలరు’’ అని సంజీవ్ త్రిపాఠీ, అధ్యక్షులు, ఎంఎస్‌ఎంఈ, విమెంటార్ డాట్ ఏఐ అన్నారు.
వీమెంటార్ డాట్ ఏఐ మరియు డబ్ల్యుఏ రెండూ కూడా ఎంఎస్‌ఎంఈ వ్యూహం మరియు అమలును అనుసరించే విధానాన్ని వ్యూహాత్మకంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, అమ్మకాలు, నిర్వహణ, సరఫరా చైన్, ఐటీ, స్ట్రాటజీ, సమ్మతి, లక్ష్యిత ఫలితాల కోసం ప్రభుత్వ విధానాలపై ఆధారపడటం వంటివి ఉన్నాయి. ఈ రెండూ పలు వందల ఎంఎస్‌ఎంఈలకు తోడ్పడుతున్నాయి మరియు వాటి ఎన్‌పీఎస్ (నెట్ ప్రొమోటర్ స్కోర్)ను మెరుగుపరుస్తున్నాయి. వీమెంటార్ డాట్ ఏఐ మరియు డబ్ల్యుఏలు కలిసికట్టుగా పనిచేయడంతో పాటుగా తమ ప్రత్యేకీకరించిన మెంటారింగ్ ఉత్పత్తులు, సేవల కోసం అర్హత కలిగిన ఎంఎస్‌ఎంఈలను వృద్ధి చేయటానికి తోడ్పడతాయి.
ఈ మార్గదర్శక ఇన్‌క్యుబేటర్ ప్రోగ్రామ్‌లో , ఎంఎస్‌ఎంఈ రంగం కోసం ఈ ఇరువురు భాగస్వాముల యొక్క అత్యుత్తమ అభ్యాసాలపై ఆధారపడతాయి. అవి మేథో సంపత్తి, మార్కెట్ చేరిక, నెట్‌వర్క్స్ మరియు అమలు ప్రతిభ, ప్రక్రియలకు తోడ్పడతాయి. ఇది ఎంఎస్‌ఎంఈలు వందలాది నాలెడ్జ్ ఎస్సెట్స్, కోర్సులు మరియు మాస్టర్ క్లాస్‌లను పొందగల కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా దారి తీస్తుంది.
సంయుక్తంగా, ఈ రెండు సంస్ధలూ తమ వనరులపై ఆధారపడి ఎంఎస్‌ఎంఈలకు మద్దతనందించే పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తాయి. ఇది అంతిమంగా సామర్ధ్యం మెరుగుపరచడంతో పాటుగా ఎంఎస్‌ఎంఈల వ్యాపార వృద్ధితో ఉద్యోగ కల్పనకు సైతం తోడ్పడుతుంది.
విమెంటార్ డాట్ ఏఐ కు చెందిన త్రిపాఠీ మాట్లాడుతూ ‘‘వీమెంటార్ డాట్ ఏఐ యొక్క యుఎస్‌పీ అయినటువంటి హ్యాండ్–హోల్డింగ్, క్లయింట్‌తో పాటుగా ఉండటం, కొలమానాల ఆధారిత ఫలితాలు ; ఎంఎస్‌ఎంఈలలో ప్రతిభను పెంపొందించడం వంటి వాటితో ఈ భాగస్వామ్యం ఎంఎస్‌ఎంఈల వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తూనే ఉపాధి, ఎగుమతి అవకాశాలను సైతం వృద్ధి చేస్తుంది’’ అని అన్నారు.