ఏపీలో దారుణం..కూతురిపై వేటకొడవలితో బాబాయ్ దాడి

0
80

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూతురిపై బాబాయ్ కత్తితో దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నేదేవి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..వెన్నేదేవి గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి కోటమ్మ వచ్చింది. అమెకు తల్లిదండ్రులు లేరు. వాళ్ల నాన్నకు బాబాయ్ కు కలిపి వెన్నాదెవి గ్రామంలో 30 సెంట్లు స్థలం కలదు.

కోటమ్మకు అన్నతమ్ములు కూడా లేరు. ఆ స్థలం విషయంలో గొడవ రావడంతో కూతురు పై బాబాయ్ కోటయ్య నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా వేటకత్తితో పలుమార్లు దాడి చేశాడు. గ్రామస్తులు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా నిందితుడు వారిని బెదిరించాడు. ప్రస్తుతం కోటమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.