ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ వద్ద సినీ కార్మికుల ఆందోళన

0
87

వేతనాలు పెంచాలని కోరుతూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈరోజు నుంచి సినీ కార్మికులు సమ్మెలోకి దిగారు. దీంతో పూర్తిగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. షూటింగ్ లు నిలిచిపోవడంతో హీరోలు, నటులు, డైరెక్టర్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

సమ్మె కు దిగిన కార్మికులు తమ వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. షూటింగ్ లకు హాజరు కాని సిని కార్మికులు కృష్ణ నగర్ లో తమ యూనియన్ ఆఫీస్ లకు చేరుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు.

పది గంటల నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలితో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు. కార్మికుల సమస్యపై వారు చర్చించనున్నారు.