డాక్టర్​ రెడ్డీస్​ బిగ్ డీల్​..50 మిలియన్​ డాలర్లకు ఒప్పందం

0
77

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్​ అమెరికా సంస్థతో బిగ్ డీల్ కుదుర్చుకుంది. 50 మిలియన్​ డాలర్లకు బ్రాండెడ్​, జెనరిక్​ ఇంజెక్టబుల్​ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు డాక్టర్​ రెడ్డీస్ సంస్థ శుక్రవారం తెలిపింది. ఈ ఒప్పందం రోగులకు సరసమైన ధరకే మందులను అందించేలా ప్రోత్సహిస్తుందని కంపెనీ పేర్కొంది.

“కొవిడ్​ మహమ్మారికి చాలా కాలం ముందు.. కొన్ని క్రిటికల్ కేర్​ ఉత్పత్తుల గురించి ఆసుపత్రులు ఆందోళనలు చెందేవి. ఈ ఒప్పందంతో అనేక మందులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఈ కారణంతో పాటు అనేక ఇతర కారణాల వల్ల ఈ ఒప్పందం చేసుకున్నాం. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.”

– మార్క్ కికుచి, రెడ్డీస్​ లాబోరేటరీస్

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక బహుళజాతి ఔషధ సంస్థ. ఈ సంస్థను భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందిన మెంటార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో పని చేసిన అంజిరెడ్డి స్థాపించాడు. డాక్టర్ రెడ్డి భారతదేశంతోపాటు విదేశాలలో కూడా విస్తృతమైన ఔషధాలను తయారు చేసి మార్కెట్ చేస్తుంది. కంపెనీలో 190 రకాలకు చెందిన మందులు, ఔషధ తయారీరంగానికి అవసరమైన 60 యాక్టివ్ ఫార్మాస్యూటికల్ (క్రియాశీల) పదార్థాలు (ఎపిఐలు), డయాగ్నొస్టిక్ కిట్లు, క్రిటికల్ కేర్, బయోటెక్నాలజీ ఉత్పత్తులు తయారవుతాయి.