Breaking- టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్

0
92

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌ విజయారెడ్డి, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీనితో గులాబి పార్టీలో వలసల గుబులు మొదలయింది.

వీరి చేరికతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపడగా తెరాస బహీనపడింది. రానున్న ఎన్నికల్లో ఈ చేరికలు టీఆర్ఎస్ కు నష్టాన్ని చేకూర్చనున్నాయి. ఇక తాజాగా మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.

అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టిఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ పార్టీలో గుబులు రేపింది. మరికొందరు నేతలు కూడా టిఆర్ఎస్ ను వీడనున్నట్లు విశ్వసనీయ సమాచారం.