పుల్సర్,కేటీఎం, బుల్లెట్ యువత మెచ్చిన బైక్ లు. దాదాపు యువత ఈ బైక్ లే వాడుతుండడం గమనార్హం. కొన్న వారు న్యూ మోడళ్లను, బైక్ కొనాలనుకునే వారికి ఇదే అత్యుత్తమ ఎంపిక. ఎందుకంటే బైక్ డిజైనింగ్, కలర్, మోడల్, capacity, మైలేజీ ఇలాంటివి చూస్తూ యువత బైక్ ఎంపిక చేసుకుంటారు.
అయితే ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలతో ఈ బైక్ లు బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. మరి వీటినే విద్యుత్ వాహనాల రూపంలో వస్తే బాగుండు అనుకునే వారికి గుడ్ న్యూస్. ‘పల్సర్ ఈవీ’ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బజాజ్ సంస్థ తెలిపింది.
భారత ద్విచక్ర వాహన విభాగంలో ఒకప్పుడు రాజ్యమేలిన ‘చేతక్’.. ఇప్పుడు విద్యుత్ వాహనంగా రాబోతోంది. దీన్ని మరిన్ని సెగ్మెంట్లలో అందుబాటులోకి తేనున్నట్లు రాకేశ్ శర్మ తెలిపారు. పల్సర్ ఈవీని సబ్ బ్రాండ్‌గా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కుర్రకారులో మంచి క్రేజ్ ఉన్న ‘కేటీఎం’ బైక్‌ను సైతం విద్యుత్ వాహనంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు, హస్క్వానా బైక్‌లు సైతం ఈవీ రూపంలో రానున్నట్లు తెలుస్తోంది.