అందంగా కనబడాలని ఎవరు మాత్రం కోరుకోరు. ముఖ్యంగా మహిళలు అందంగా ఉండడం కోసం వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడంతో కాస్మొటిక్స్ వాడుతున్నారు. కానీ కాస్మొటిక్స్ వాడడం వల్ల భవిష్యత్తులో అనేక చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాస్మొటిక్స్ తయారీలో వాడే రసాయనాలు చర్మంపై ప్రభావం చూపి చర్మసంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్మొటిక్స్ వాడినప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో చాలా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
కొన్ని రకాల క్రీముల కారణంగా మొటిమలు వాడడం వల్ల మొటిమలు వస్తే..కొన్ని రకాల డైలు పడకపోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు వంటివి రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది నల్లగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కాస్మొటిక్స్ వాడేముందు గాఢమైన వాసన, ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోకూడదదు.