ఫ్లాష్- వ్యాపార దిగ్గజం ‘పల్లోంజీ మిస్త్రీ’ కన్నుమూత

0
73

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ఛైర్మన్‌ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మిస్త్రీకి మొత్తం నలుగురు సంతానం. షాపూర్జీ పల్లోంజీ గ్రూపు ప్రధానంగా ఇంజినీరింగ్‌, నిర్మాణం, ఇన్​ఫ్రా,రియల్‌ ఎస్టేట్‌, వాటర్‌, ఎనర్జీ, ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో సేవలు అందిస్తోంది. ముంబయిలోని ఆర్‌బీఐ భవనం, ది తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ నిర్మించింది పల్లోంజీ గ్రూపే.