ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్..8 మంది విద్యార్థులు ఆత్మహత్య

0
95

నిన్న ఇంటర్ ఫలితాలు విడుదల అయినా సంగతి తెలిసిందే.  సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను నిన్న విడుదల చేసారు. ఇటీవలే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని..మళ్లీ సంప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలుంటాయని ప్రకటించిన కూడా విద్యార్థులు తొందరపాటు తనంతో తమ ప్రాణాలను తామే బలి తీసుకున్నారు.

ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయామని ఏడుగురు..మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొత్తం ఎనిమిదిమంది చనిపోగా ఇందులో హైదరాబాద్‌ నగరానికి చెందిన నలుగురు విద్యార్థులు, పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన వారు ముగ్గురు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపల్లికి చెందిన విద్యార్థిని ఒకరు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించలేకపోయామని ముగ్గురు, తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు నగరంలో తనువు చాలించారు.