ఆయనొక మాజీ మంత్రి, త్రిపుర ప్రస్తుత ఎమ్మెల్యే. ప్రజలకు సేవ చేయడం, ఎల్లప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచించాల్సింది పోయి ఒంకర బుద్ది చూపించాడు . ఏకంగా ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇప్పుడు ఈ వార్త కలకలం రేపుతోంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు త్రిపుర మాజీ మంత్రి, ఎమ్మెల్యే మెవార్ కుమార్ జమతియాపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో జమతియ ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.