తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున సవాల్ విసిరారు. తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని, ఒకవేళ కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. రేపు సీఎం కేసీఆర్ అధికారులను తీసుకొని రావాలని.. తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. మేము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నాం. కావాలనే ఈటలపై తెరాస ప్రభుత్వం కక్ష గట్టిందని జమున అసహనం వ్యక్తం చేశారు.