నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం..ఏయే వస్తువులంటే?

0
96

నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం అమలులోకి రానుంది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై ఈ నిషేధం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాదు పెట్రో కెమికల్‌ సంస్థలు కూడా ప్లాస్టిక్‌ ముడిసరకును వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. మరి నిషేధ జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో చూద్దాం..

నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులు ఇవే..

100 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లు

బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌

ప్లాస్టిక్‌ జెండాలు

ఇయర్‌బడ్స్‌

క్యాండీ స్టిక్స్‌-పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్‌ పుల్లలు

ఐస్‌క్రీమ్‌ పుల్లలు

అలంకరణ కోసం వాడే థర్మోకోల్‌

వేడి పదార్థాలు, స్వీట్‌ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్‌

ఆహ్వాన పత్రాలు

సిగరెట్‌ ప్యాకెట్లు

ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు

ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్‌ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు..

ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు పాటించకుంటే వాటి లైసెన్సులు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. నిషేధం ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ‘ఎస్‌యూ-పీసీబీ’ అనే ప్రత్యేక ఆన్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.

“ప్లాస్టిక్ ను తరిమికొట్టండి..ప్రకృతిని కాపాడండి”