సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి కలకలం

0
73

సీపీఎం కార్యాలయంపై బాంబు దాడి కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. కేరళలోని తిరువనంతపురంలోని సీపీఎం కార్యాలయంపై ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు.. బాంబు విసిరి పారిపోయాడని పోలీసులు తెలిపారు.

“ఏకేజీ సెంటర్​లోని మూడో అంతస్తులో నేను పనిచేసుకుంటున్నాను. రాత్రి 11:30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. గేటు వద్ద పొగ అలుముకుంది. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఖండించాలి” అని సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పీకే శ్రీమతి వెల్లడించారు.