Breaking news: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి..18 మంది మృతి

0
98

ఉక్రెయిన్ పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఒడెసాలోని 9 అంతస్తుల భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 30మంది గాయపడినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. అయితే స్నేక్‌ ఐల్యాండ్‌ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మాస్కో సేనలు ఉక్రెయిన్‌పై దాడి చేయడం కలకలం రేపుతోంది.