పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే..

0
111

చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు బాధపడే సమస్యలలో పంటినొప్పి కూడా ఒకటి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. కానీ ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. అందుకే అలాంటివారి కోసమే ఈ సింపుల్ చిట్కాలు..

చాక్లేట్స్, తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల, మనం త్రాగేనీటిలో వుండే ప్లోరోసిస్ వల్ల, దెబ్బలు తగలడం వల్ల పళ్లు దెబ్బతింటాయి. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి వచ్చి తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. పంటినొప్పి రాగానే గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పువేసి నోట్లో వేసుకొని బాగా పుక్కిలించడం వల్ల ఈ సమస్య నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు.

ఇంకా ఉల్లిగడ్డ ముక్కను కోసి నొప్పిగా ఉన్న పంటిపై వెంటనే ఉంచుకోవడం వల్ల తొందరగా నొప్పి తగ్గి మంచి ఫలితాలు లబిస్తాయి. ముఖ్యంగా జామ ఆకులు పంటినొప్పిని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది. పంటినొప్పి వచ్చినప్పుడు జామ ఆకును నమిలి రసం మింగడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.