విజయ్- పూరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ?

0
115

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత వీరి కాంబినేషన్ లోనే ‘జనగణమన’ సినిమా రాబోతుంది. ఇది పూరి కలల ప్రాజెక్ట్ కావడం విశేషం.

ఇక ఇప్పుడు మరో వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. వీరి కాంబోలో మరో సినిమా కూడా రాబోతుందని విశ్వసనీయ సమాచారం. దీనితో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ కూడా ఉండబోతుందన్నమాట. అందుకోసం మరో పెద్ద నిర్మాణ సంస్థతో చేతులు కలపనున్నట్లు సమాచారం. ఈ మేరకు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ సినిమాల పరంగా ప్రస్తుతం సమంతతో కలిసి ‘ఖుషి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.