ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ రిలీజ్

0
107

ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ రిలీజ్ అయింది. 2022 -23 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాల షెడ్యూల్‌ను బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ గురువారం విడుదల చేశారు. మొదటి విడత అడ్మిషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయ‌ని, ఆగస్టు 17లోగా మొదటి విడుత అడ్మిషన్లు పూర్తిచేస్తామని తెలిపారు.

మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు పూర్తిచేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను బోర్డు మంజూరు చేసిన సెక్షన్లు, ప్రతి విభాగంలోని సీట్ల సంఖ్యను ప్రతిరోజూ కాలేజీలో ప్రదర్శించాలని జలీల్‌ ఆదేశించారు. ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందాలని సూచించారు. అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను https://acadtsbie.cgg.gov.in, https://tsbie.cgg. gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు.

కాగా ఫస్టియర్‌లో చేరిన వారికి జూలై 11 నుంచి తరగతులు నిర్వహిస్తారు. ప్రవేశాల్లో తొలిసారిగా ఈడబ్ల్యూఎస్ కోటాకు 10 శాతం సీట్లు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీలకు 29, పీహెచ్‌ 3, ఎన్‌సీసీ, స్టోర్ట్‍ కోటాలో 5, ఎక్స్​​‍సర్వీస్మెన్‌ 3 చొప్పున రిజర్వేషన్లు ప్రకారం సీట్లను భర్తీ చేయాలని కోరారు. 33 శాతం సీట్లను బాలికల కోసం కేటాయించాలని పేర్కొన్నారు.