ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి చేరుకున్నారు. కాసేపట్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు.