ఏపీలో విషాదం..కౌలు రైతు ఆత్మహత్య

0
147

దేశంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయం చేస్తే పెట్టుబడి గిట్టక తనువు చాలిస్తున్నారు. దీనికి తోడు ఎరువులు, మందులు, నాటు కూళ్లు పెరగడంతో అప్పుల పాలవుతున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన నెలకొంది. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..నకరికల్లు చెందిన కౌలు రైతు యాసం నరసింహరావు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. గత పది సంవత్సరాలుగా పంట దక్కకపోవడంతో సుమారు రూ.12 లక్షలు అప్పులపాలయ్యారు.

దీనికి తోడు కౌలు, ఎరువులు, పురుగుమందుల పెట్టుబడులు ఎక్కువ కావడం, చేసిన అప్పులు తీరే దారి లేక మనస్తాపంతో ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.