పెళ్లి, విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు

0
115

ఒకప్పుడు నాగచైతన్య, సమంత జంటకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల అనంతరం వీరి ప్రయాణంలో అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి. అవి చివరకు విడాకులకు దారి తీశాయి.

ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఫుల్ బిజీగా సినిమాలను చేస్తున్నారు. చైతు థాంక్యూతో, సమంత యశోద సినిమాలో నటిస్తున్నారు. ఇక చై పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు టాక్. ఇక తాజాగా పెళ్లి, విడాకులపై స్పందించిన సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7కి మొదటి ఎపిసోడ్ లో తన వైవాహిక జీవితంపై సమంత కామెంట్స్ చేసింది.

ఇందుకు సంబంధించిన ప్రోమోను కరణ్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో కరణ్‌ జోహార్‌ ఫ్యామిలీ లైఫ్‌ గురించి సమంతని ప్రశ్నించారు. `అన్‌ హ్యాపీ మ్యారేజ్‌ లైఫ్‌`కి కారణమేంటని ప్రశ్నించగా, సమంత ఇరిటేట్‌(నవ్వుతూ) అయ్యింది. నీ వల్లే తన మ్యారేజ్‌ లైఫ్‌లో సంతోషం లేకుండా పోయిందని ఆరోపించింది. పెళ్లి  లైఫ్ `కభీ ఖుషీ కభీ ఘమ్‌`లో ఎంతో బాగా చూపించారు. కానీ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. `కేజీఎఫ్‌`లా ఉంటుందని పేర్కొంది సమంత. కేజీఎఫ్‌లో హీరోయిన్‌ పరిస్థితిలా తన లైఫ్‌ అయ్యిందనే ఉద్దేశ్యంతో సమంత చెప్పింది. మొత్తంగా బోల్డ్ గా, షాకింగ్‌గా తన కామెంట్‌ చెప్పడంతో ఇప్పుడది వైరల్‌ అవుతుంది.