ఆ సినిమా కోసం నందమూరి, మెగా హీరోల పోటీ..!!

ఆ సినిమా కోసం నందమూరి, మెగా హీరోల పోటీ..!!

0
85

బాలీవుడ్ లో వచ్చిన పింక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. అమితాబ్ ముఖ్య పాత్రలో తాప్సి నటించిన ఈ సినిమా సౌత్ లో తమిళ్లో అజిత్ హీరో గా రీమేక్ చేయగా అక్కడ కూడా సినిమా రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ను తెలుగు లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

దానికోసం ఇద్దరు పెద్ద హీరోలను సంప్రదిస్తున్నారు.. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు ఒకరు బాలకృష్ణ.. ఇంకొకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే బాలకృష్ణని నిర్మాత బోనీ కపూర్ సంప్రదించారని ఆయన ఈ కథలో నటించడానికి ఆసక్తిగా వున్నారని సమాచారం.

అయితే అది ఆలస్యమవుతుండడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని సంప్రదించారట. క్రియాశీల రాజకీయాల్లో బిజీ అయిన పవన్ సినిమాలకు ఇక బ్రేక్ ఇచ్చినట్టే అని ప్రచారం జరిగింది.. ఈనేపథ్యంలో ఈ సినిమా లో ఎవరు ఈ సినిమా లో నటిస్తారో చూడాలి..