తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీనితో గులాబి పార్టీలో వలసల గుబులు మొదలయింది.
ఇక తాజాగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ గూటిలో చేరనున్నారు.