తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
ఇక తాజాగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ గూటిలో చేరనున్నారు. అలాగే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు కూడా ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. టి.పీసీసీ చీఫ్ రేవంత్ నేతృత్వంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు నేతలు.