మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగిసింది. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ శిందే.. సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మెజారిటీ ఎమ్మెల్యేలు శిందేకు మద్దతు పలికారు. శివసేన చీఫ్ విప్‌గా ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించారు.