ఇండియా కరోనా అప్డేట్..తాజా కేసులు ఎన్నంటే?

0
85

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,086 మంది వైరస్​ బారినపడగా.. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3 వేల వరకు తగ్గింది. దీనితో కొంతమేర ఊరట కలిగింది. కొవిడ్​ నుంచి 12,456 మంది కోలుకున్నారు.

మొత్తం కేసులు: 4,35,31,650‬

మొత్తం మరణాలు: 5,25,242

యాక్టివ్​ కేసులు: 1,14,475

కోలుకున్నవారి సంఖ్య: 4,28,91,933