షాపుల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు..తప్పిన పెను ప్రమాదం

0
121

ఏపీలో ఓ ట్రావెల్స్ బస్సు హల్ చల్ చేసింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో
మంగళవారం రోడ్డు పక్కన గల షాపుల్లోకి ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుండి
గుంటూరు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దాచేపల్లి సీఐ బిలాలుద్దీన్, ఎస్ఐ రహంతుల్లా సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.