ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏపీకి చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్కే ఫరూక్భాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్ హిల్స్ వద్ద ఉండగా కారులో నలుగురు వ్యక్తులు వచ్చి, తనను బలవంతంగా ఎక్కించుకొని ఎంపీ రఘురామ ఇంటికి తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పర్సు, ఐడీ కార్డు కూడా లాక్కున్నారని తెలిపారు. కేసులో ఎంపీ రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ను నిందితులుగా చేర్చారు.