Flash: సామాన్యులకు షాక్..మళ్లీ పెరిగిన ధరలు

0
76

ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డిజీల్‌ ధరలతో సామాన్యులు నానా తంటాలు పడుతున్నారు. ఇక తాజాగా మరోసారి సిలిండర్‌ ధరలు పెంచి సామాన్యుడు నడ్డి విరిచింది కేంద్ర సర్కార్‌. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ. 50 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1055లు ఉండగా దీనిపై రూ. 50 అదనంగా పెంచడంతో రూ.1105కు చేరింది. దీంతో సామాన్యులపై పెనుభారం పడనుంది.  పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.