ఏపీ సర్కార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజలకు చేరువైన వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నవరత్నల్లో భాగంగా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
జూలై 13న అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ రాజబాబు తెలిపారు. అలాగే వాహణాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, మరమ్మతుల నిమిత్తం నగదు సాయం అందిస్తున్నట్లు తెలిపారు..అర్హులైన వారికి వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకోవచ్చునని తెలిపారు.
ఇప్పటికే దరఖాస్తుల పక్రియ ప్రారంభం అయ్యింది.ఈనెల 7 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్దిదారుల ఎంపిక అనేది పారదర్శకంగానే జరుగుతుందని, దరఖాస్తుదారుడు తనకు సంబంధించిన భూమి, ఆస్తి వివరాలు, ఆస్తి పన్ను కట్టిన వివరాలు, విద్యుత్ వినియోగం, ఆదాయపు పన్ను, కులం వివరాలు అందించాల్సి ఉందన్నారు. వాహనదారులు ఆధార్, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు.