ఆ మంత్రికి సీఎం దగ్గర తీరుగేలేదు….

ఆ మంత్రికి సీఎం దగ్గర తీరుగేలేదు....

0
97

2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ కేబినెట్ లో అత్యంత కీలకంగా ఏవరైనా వ్యవహరిస్తున్నారా అంటే టక్కున బొత్స సత్యనారాయణ అనే చెప్పవచ్చే…

గత టీడీపీ నాయకులు చేసిన తప్పిదాల కాటినుంచి రాజధాని భూములు, కుంభకోణం, తాజాగా కోడెల ఆత్మహత్య వరకు అన్ని విషయాలను ఆయన మీడియా ముందు ప్రకటిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మీడియాకు చాలా దూరమయ్యారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను బొత్స కీలకంగా వ్యవహరిస్తున్నారు… అంతేకాదు ఒకానొక దశలో ఆయన వైసీపీలో నంబర్ 2 గా వ్యవహరిస్తు తనదైన మార్క్ ను సంపాదించుకుంటున్నారు… దీంతో ప్రస్తుతం జగన్ దగ్గర బొత్స తిరుగులేని నాయకుడుగా ఎదిగారని రాజకీయ మేధావులు అంటున్నారు.