ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా..ఐదుగురు అరెస్ట్

0
113

ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా కలకలం రేపింది.  అనంతపురం రేంజ్ డిఐజి రవి ప్రకాష్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…చిన్న గొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీ, గొల్లపల్లి సమీపంలో డంపింగ్ నుండి లోడు చేస్తుండగా సమాచారం అందింది. ఈ క్రమంలో ఐదుగురును అరెస్ట్ చేయగా..మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. వారి వద్ద  నుండి 1281 కేజీల బరువు గల 43 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన కారు , ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్  చేశారు.