మతిమరుపుతో బాధపడుతున్నారా? అయితే ఇవి ట్రై చేయండి..

0
87

మనుషుల వయస్సు పెరిగే కొద్దీ మనిషికి మతిమరుపు రావడం సహజం. ఇక వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గడంతో పాటు ఆలోచనా శక్తి , తెలివితేటలు కూడా మందగించి మతిమరుపు వచ్చేస్తుంది. అన్ని విషయాలు మర్చిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయస్సుల వారికి ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డైలీ డైట్‌లో ఇవి చేర్చుకోవడం వల్ల మతిమరుపు సమస్య నుంచి బయటపడొచ్చు.

బాదం: బాదంపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్‌ని సూపర్ ఫుడ్స్ అని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. ఇవి అనేక పోషకాలతో నిండి ఉంటాయి.
చేప: చేపలలోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి అని చిన్నప్పటి నుంచే వింటూనే ఉన్నాం.. కానీ ఆదివారం వస్తే చికెన్‌, మటన్‌ వైపే జనాలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. చేపలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వు ఆమ్లాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే కణాల నష్టాన్ని కూడా తగ్గిస్తాయి.
చికెన్: చికెన్‌లో ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ B6, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే రెగ్యులర్‌గా చికెన్‌ తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి., కాబట్టి మసాలాలు తగ్గించి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా చేసుకుని తినాలి.